Asianet News TeluguAsianet News Telugu

#ManchuManoj:'ఉస్తాద్' గా మంచు మనోజ్

 మంచు మనోజ్ ..  సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మంచు మనోజ్‌ ..ఆ మధ్యన  డెబ్యూ డైరెక్టర్‌ శ్రీకాంత్ రెడ్డితో..

Manchu Manoj Come Back With New Talk Show  #USTAAD Ramp Addidham jsp
Author
First Published Nov 19, 2023, 12:30 PM IST


గత కొంతకాలంగా రకరకాల కారణాలతో వెండితెరకు దూరంగా ఉన్న మంచు మనోజ్... ఓ టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Winలో రాబోతున్న ఈ టాక్‌ షోను అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఈ మధ్యనే షూటింగ్‌ కూడా షురూ అయ్యిందని టాక్‌. ఇప్పటికే  ఈ షో ప్రోమోను  విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మంచు మనోజ్ తన గురించి తాను చెప్పుకున్నారు. రాకింగ్ స్టార్ మళ్లీ రాబోతున్నాడని చెప్పారు. మనోజ్ వాయిస్‌తో కూడిన ఈ ప్రోమో  అందరినీ ఆకర్షిస్తోంది. మళ్లీ ఆ గంభీరమైన గొంతును విన్నందుకు ఆనందంగా ఉందని మనోజ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ షో పేరు"ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం".   మంచు మనోజ్...సెలబ్రిటీస్ తో టాక్ గేమ్ షో అంటే మాట్లాడుకుంటూ ఆడడం ఈ షో స్పెషల్.  

ఇప్పటికే రిలీజైన ప్రోమోలో...‘నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచీ సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్‌గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్‌ స్టార్‌ అని ఒక పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌, అరుపులు, కేకలు.. ఇలా ఒక పండగలా జరిగిన నా లైఫ్‌లోకి సడెన్‌గా ఒక సైలెన్స్‌ వచ్చింది. మనోజ్‌ అయిపోయాడు అన్నారు. కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్‌ ఆపేశాడు.. ఇంక తిరిగి రాడు అన్నారు. ఎనర్జీ స్టార్‌లో ఎనర్జీ తగ్గిందీ అన్నారు. విన్నాను.. చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను’ అంటూ మనోజ్ చెప్పే మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోతో ఒక్కసారిగా మళ్లీ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు మనోజ్.

ఇదిలా ఉంటే ఇక మంచు మనోజ్ ..  సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మంచు మనోజ్‌ ..ఆ మధ్యన  డెబ్యూ డైరెక్టర్‌ శ్రీకాంత్ రెడ్డితో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వైష్ణవ్ తేజ్ చేస్తున్నాడు. ఇవి కాకుండా మంచు మనోజ్‌ What The Fish.. మనం మనం బరంపురం.. (క్యాప్షన్)‌ కూడా ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్‌ వరుణ్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో డార్క్‌ కామెడీ-హై ఆక్టేన్‌ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios