మంచు ఫ్యామిలీ నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది. ఆ మధ్యన మంచు మనోజ్ భూమా మోనికని రెండో వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
మంచు ఫ్యామిలీ నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది. ఆ మధ్యన మంచు మనోజ్ భూమా మోనికని రెండో వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, విష్ణు లకు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి.
ఏదైతేనేం కుటుంబ సభ్యుల సమక్షంలోనే మంచు మనోజ్, భూమా మౌనిక ఒక్కటయ్యారు. ఆ తర్వాత మంచు విష్ణు తన సన్నిహితులతో గొడవకి దిగుతున్నాడు అంటూ మనోజ్ ఓ వీడియో పోస్ట్ చేయడం ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఈ వీడియోతో మంచు ఫ్యామిలీ పరువు మీడియాకి ఎక్కింది. ఇలాంటివి అన్ని కుటుంబాల్లో సహజమే అంటూ మంచు ఫ్యామిలీ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేసింది. అది ఒక రియాలిటీ షోలో భాగం అని భ్రమ కల్పించేలా విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ అనే టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఏది ఏమైనా మంచు మనోజ్ మాత్రం తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మనోజ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆదివారం రోజు భూమా అఖిల ప్రియ 36వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన అక్కకి భూమా మౌనిక బర్త్ డే విషెస్ చెబుతూ రేర్ ఫోటో షేర్ చేసింది.

ఈ పోస్ట్ ని మనోజ్ రీపోస్టు చేస్తూ.. హ్యాపీ బర్త్ డే వదినమ్మ భూమా అఖిల ప్రియా అంటూ మనోజ్ ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అఖిల ప్రియని మనోజ్ ఆప్యాయంగా వదినమ్మా అని పిలవడంతో ఫ్యాన్స్ ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. మంచు మనోజ్ కి కొద్ది కాలంలోనే భూమా ఫ్యామిలీతో మంచి అనుబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు.
మనోజ్ మరో పోస్ట్ లో ' ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు అని కామెంట్ పెడుతూ తన భార్యతో అందంగా ముస్తాబై ఇంట్లోకి వెళుతున్న దృశ్యాలు షేర్ చేశాడు. మంచు మనోజ్ గతంలో వివాహం జరిగి మొదటి భార్యతో విడిపోయారు. భూమా మౌనికకి కూడా ఇది రెండవ వివాహమే.
