నేడు శుక్రవారం భూమా మౌనికతో మంచు మనోజ్ రెండవ వివాహం జరగనుంది. 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో ఇద్దరూ విడిపోయారు.

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ చిత్రాలతో మంచు మనోజ్ అలరించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మనోజ్ మంచి మనసున్న వ్యక్తి అని అభిమానులు ప్రశంసిస్తుంటారు.ఇటీవల మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయారు. 

నేడు శుక్రవారం భూమా మౌనికతో మంచు మనోజ్ రెండవ వివాహం జరగనుంది. 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సింగిల్ గా ఉన్న మంచు మనోజ్ కి భూమా మౌనిక పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఈ జంట నేడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. 

భూమా మౌనికకి కూడా ఇది రెండవ వివాహమే. ఆమెకి కూడా 2015లో బెంగుళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. వైవాహిక జీవితంలో తొలిసారి చేదు అనుభవం ఎదుర్కొని వీరిద్దరి మనసులు కలిశాయి. దీనితో మనోజ్, మౌనిక ఎడడుగుల బంధానికి రెడీ అవుతున్నారు. 

అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. మంచు ఫ్యామిలీ, భూమా కుటుంబం మధ్య చాలా కాలంగా మంచి రిలేషన్ ఉందట. గతంలో భూమా మౌనిక పెళ్లి జరిగినప్పుడు మంచు మనోజ్ అతిథిగా హాజరయ్యాడు. ఈ మేరకు కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఏడేళ్లు గడిచే సరికి పరిస్థితి మారిపోయింది. అదే భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 

ఫిలిం నగర్ లో మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహం జరగనుంది. శుక్రవారం 8.30 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. మంచు లక్ష్మి పెళ్లి ఏర్పాట్లని దగ్గరుండి చూస్తుకుంటున్నట్లు తెలుస్తోంది. భూమా అఖిల ప్రియ, భూమా మౌనిక తమ తల్లిందండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భూమా మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ కొన్నేళ్ల క్రితం మరణించారు.