సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Lakshmi Manchu) తాజా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మలయాళ నటుడిని పరిచయం చేస్తూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

స్టార్ కిడ్ మంచు లక్ష్మి టాలీవుడ్ లో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో లేడీ విలన్ గా, నటిగా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలోనూ సెలబ్రెటీ కిడ్ ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగానే కనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రం సందేహించకుండా.. నిర్భయంగా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఈక్రమంలో మంచు లక్ష్మి ట్ ట్విటర్ లో తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే..

వరుస చిత్రాలతో మంచులక్ష్మి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘అగ్ని నక్షత్రం’ (Agni Nakshatram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ కు సిద్ధమవడంతో ఒక్కో అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా కేరళ నటుడు సిద్ధిక్ (Sidhique) ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ను ట్వీట్టర్ పోస్ట్ చేస్తూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

మలయాళ నటుడు సిద్దిక్ ను పరిచయం చేస్తూనే.. ఇలా కామెంట్స్ చేసింది. ‘అత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం’ అని పేర్కొంది. సినిమాలోని ఆయన పాత్ర తాలుకూ ఆలోచనలపై ఆమె స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గా 16 సెప్టెంబర్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర శుక్లా, విశ్వంత్ ప్రధాన తారాగణంగా ఉన్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ, దర్శకత్వం వహిస్తున్నారు.

View post on Instagram