శూర్పణఖ పాత్రలో ప్రభాస్ పై మససు పడతానంటున్న మంచులక్ష్మీ..!
ప్రభాస్ నేడు తన 22వ చిత్రం దర్శకుడు ఓం రౌత్ తో ప్రకటించారు . రామాయణంపై తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తున్నాడన్న న్యూస్ సంచలనంగా మారింది. ఐతే ఈ మూవీలోని సూర్పణఖ పాత్రకు నేను సై అంటుంది మంచు వారి అమ్మాయి.
నేడు దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలలో హాట్ టాపిక్ గా నిలిచింది ప్రభాస్ కొత్త మూవీ ప్రకటన. తన పాన్ ఇండియా ఇమేజ్ కి సరిపోయేలా మరో భారీ చిత్రాన్ని ఆయన ప్రకటించారు. అందులోనూ ప్రభాస్ గతంలో ఎప్పుడూ చేయని మైథలాజికల్ ఫిల్మ్ ఎంచుకోవడం గమనార్హం. అది కూడా రామాయణం, అందులో ప్రభాస్ ది రాముడి పాత్ర అనడం అత్యంత ఆసక్తిరేపుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.
ఇక రామునిగా ప్రభాస్ ఎలా ఉంటాడనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. ఈ మూవీలో మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఐతే రామాయణంలో కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉంది. రావణాసురుడి చెల్లెలు అయిన సూర్పణఖ వనవాసంలో ఉన్న రాముడిని ఇష్టపడుతుంది. ఐతే తాను ఏక పత్నీ వ్రతుడు కావున ఆయన లక్షణుడు దగ్గరికి పంపిస్తాడు. కొంచెం కోపిష్టి అయిన లక్ష్మణుడు ఆమె రాక్షస జాతి స్త్రీ కావడంతో చెవులు, ముక్కు కోసి పంపుతాడు. దాని వలనే రావణాసురిడి దృష్టి సీత వైపుకు మళ్లుతుంది.
కాగా ఈ కీలకమైన సూర్పణఖ పాత్రకు ఓ నెటిజెన్ మంచు లక్ష్మీ ఐతే బాగుంటుందని ట్వీట్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీలో ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధం, ఎక్కడ సైన్ చేయాలో చెప్పండని ఆమె సదరు నెటిజన్ ట్వీట్ కి ఫన్నీ రిప్లై ఇచ్చింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ లో అలాంటి పాత్ర చేసే అవకాశం రావడం కూడా అదృష్టమే కదా.