కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అవుతుంది. మంచు లక్ష్మి ట్వీట్‌కి నెటిజన్ల షాకింగ్‌ కామెంట్లు మరింత హాట్‌ టాపిక్‌గా, సంచలనంగా మారాయి. 

కరోనా సునామీలా ముంచుకొస్తుంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో పోరాడుతున్నారు. మరోవైపు శుక్రవారం మంత్రి కేటీఆర్‌కి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌, మోహన్‌బాబు వంటి వారు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. 

అందులో భాగంగా మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అవుతుంది. మంచు లక్ష్మి ట్వీట్‌కి నెటిజన్ల షాకింగ్‌ కామెంట్లు ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌గా, సంచలనంగా మారాయి. ఆ కథేంటో చూస్తే.. కేటీఆర్‌కి కరోనా సోకిందన్న విషయం తెలిసి, ఆయన త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంలో మంచు లక్ష్మి మంత్రితో తనకున్న అనుబంధం నేపథ్యంలో `త్వరగా కోలుకోవాలి బడ్డీ. ఇప్పుడు నా సినిమాలన్నీ చూడు` అని ట్వీట్‌ చేసింది. 

దీనికి నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. అదే జరిగితే కేటీఆర్‌ లిటరల్‌గా చనిపోవడం పక్కా అంటూ నవ్వు ఎమోజీని పంచుకున్నారు. మంచు లక్ష్మి సినిమాలు చూడటం కంటే కరోనాతో ఉండటమే మేలంటూ సెటైర్లు వేశాడు. సరదాగా వేసిన ఈ సెటైర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా మరికొందరు రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. `బడ్డీ ఏంటీ?, కేటీఆర్‌ నీ దోస్తా.. ఆయన రాష్ట్రానికి మంత్రి, గౌరవంగా మాట్లాడటం నేర్చుకో ` అని, `ఒక్క మంచి సినిమా పేరు చెప్పు చూద్దాం` అని మరొకరు, `ఆమె చంపాడం ఖాయం, ఆయన చనిపోవడం ఖాయం` అంటున్నట్టుగా ఉన్న బ్రహ్మానందం క్లిప్‌ని పెట్టి సెటైర్లు వేశారు ఇంరొకరు. మొత్తంగా ఇది సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అవుతుందని చెప్పొచ్చు. 

Scroll to load tweet…