మంచు లక్ష్మి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. ఆమె చేసిన ఓ కోట్ ఆసక్తి రేపుతోంది. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ మొదలైంది.  

హీరో మనోజ్ ఇచ్చిన షాక్ కి మంచు ఫ్యామిలీ సోషల్ మీడియా పోస్ట్స్ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎప్పుడేం బాంబు పేల్చుతారనే ఉత్కంఠ నెలకొంది. మనోజ్ వరుస పోస్ట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. విష్ణుతో గొడవ పడుతున్న వీడియో నేరుగా సోషల్ మీడియాలో పెట్టి మనోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ వీడియోలో విష్ణు మీద మనోజ్ ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సంచలన వీడియో క్షణాల్లో డిలీట్ చేశారు. అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో పాటు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

ఆ తర్వాత కూడా పరోక్షంగా విష్ణుని టార్గెట్ చేస్తూ మనోజ్ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టాడు. అయితే విష్ణు వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మనోజ్ విడుదల చేసిన వీడియో జస్ట్ ఫ్రాంక్. హౌస్ ఆఫ్ మంచూస్ టైటిల్ తో రియాలిటీ షో చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ షో ప్రమోషన్ లో భాగంగా మనోజ్ సదరు వీడియో సోషల్ మీడియాలో పెట్టారని వెల్లడించారు. జనాలు మాత్రం నమ్మడం లేదు. 

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి లేటెస్ట్ పోస్ట్ ఆసక్తి రేపింది. 'ఒకరితో మీరు వాదించే ముందు వాళ్లకు ఆ విషయం మీద అవగాహన ఉందా? పలు కోణాల్లో తరచి చూడగల పరిజ్ఞానం వుందా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేదంటే అలాంటి వాళ్లతో వాదించి ఎలాంటి ప్రయోజనం ఉండదు' అని ఓ కోట్ షేర్ చేశారు. దీంతో మంచు లక్ష్మి ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారనే చర్చ మొదలైంది. 

కాగా విష్ణు-మనోజ్ మధ్య గొడవలు జరుగుతుండగా... మంచు లక్ష్మి చిన్న తమ్ముడు వైపే అని సమాచారం. అందుకే పెళ్లి పెద్దగా మారి మనోజ్ పెళ్లి చేసింది. విష్ణు, మోహన్ బాబు ఈ వివాహ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తండ్రిగా మోహన్ బాబుకు తప్పక పెళ్లి మండపంలో అడుగుపెట్టారు. మూడు రోజులు మంచు లక్ష్మి తన నివాసంలో మనోజ్ వివాహం జరిపించింది. మరోవైపు విష్ణుతో ఆమెకు కూడా చెడిందంటున్నారు. మనోజ్ తో కనిపిస్తున్న మంచు లక్ష్మి... విష్ణుకు దూరంగా ఉంటున్నారు. ఆమె తాజా కోట్ విష్ణు ఉద్దేశించి కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రధాన పాత్ర చేసిన అగ్ని నక్షత్రం మూవీ త్వరలో విడుదల కానుంది.