మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక మంచు ఫ్యామిలిలో మంచు లక్ష్మి నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా మంచు లక్ష్మి రాంచరణ్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మంచు లక్ష్మి కుమార్తెతో రాంచరణ్ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఈ ఫోటో చూస్తుంటే నేను చిన్నతనంలో చిరంజీవి గారితో దిగిన ఫోటో గుర్తొస్తోంది అని మంచు లక్ష్మి కామెంట్ చేసింది. జీవితం మళ్ళీ మొదలైన చోటికే వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. మన స్నేహం కొనసాగుతూనే ఉండాలి అని మంచు లక్ష్మి ఆకాంక్షించింది. 

రాంచరణ్ ని ఉద్దేశిస్తూ.. నీకు పిల్లలు పుట్టిన తర్వాత నా కూతురు వాళ్లకు పెద్ద అక్కగా ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని మంచు లక్ష్మి సరదాగా వ్యాఖ్యానించింది. దీనిపై రాంచరణ్ సతీమణి ఉపాసన స్పందించారు. చాలా క్యూట్ పోస్ట్ అని ఉపాసన కామెంట్ చేసింది.