సాయిధరమ్ తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి.

సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో టాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ స్కిడ్ కావడంతో తేజుకి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజుని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. 

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కి అపోలో ఆసుపత్రిలో వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ గురించి మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ మధ్యం సేవించి బైక్ రైడ్ చేయలేదని పోలీసులు తెలిపారు. అయినా కొన్ని రూమర్స్ ఆగడం లేదు. 

సాయిధరమ్ తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనిపై మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

'నాకు తెలిసిన రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎలాంటి సందర్భంలోనూ సాయిధరమ్ తేజ్ అతివేగంతో వెళ్ళడు. రోడ్డుపై ఉన్న మట్టి కారణంగానే ప్రమాదం జరిగింది. దయచేసి పుకార్లు క్రియేట్ చేయొద్దు. ప్రస్తుతం తేజు ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. 

సినీ రాజకీయ ప్రముఖులు తేజు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. నారా లోకేష్ కూడా తేజు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. తిరిగి అదే ఎనర్జీతో అభిమానుల ముందుకు రావాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

తేజు అవయవాల పనితీరు బావుందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని.. అయితే అది అంత ప్రమాదకరం కాదని వైద్యులు అంటున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…