Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun : మంచు లక్ష్మికి అల్లు అర్జున్ టాస్క్.. నెల రోజులు బన్నీ చెప్పినట్టు చేయనున్న స్టార్ కిడ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మంచు లక్ష్మి Manchu Lakshmi కి ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఇందుకు స్టార్ కిడ్ అంగీకరించింది. ఇంతకీ ఏంటంటే...

Manchu Lakshmi Accepted Allu Arjuns challenge NSK
Author
First Published Jan 5, 2024, 3:43 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ Pushpa తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. భారీ ఫ్యాన్ పాలోయింగ్ కూడా పెరిగిపోయింది. దీంతో బన్నీ ఇచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. తన ఫ్యాన్స్ తో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. 

ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా ఇంట్రెస్టింగ్ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు.. అదేంటంటే... రీసెంట్ గా అల్లు అర్జున్ స్టార్ కిడ్ మంచు లక్ష్మి ఓ టాస్క్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా నీ గోల్స్ ను పబ్లిక్ తో ఓపెన్ గా షేర్ చేసుకోవాలని సూచించాడు. ఈ ఛాలెంజ్ ను మంచు లక్ష్మి అంగీకరించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని షేర్ చేసింది. 

రీసెంట్ గా అల్లు అర్జున్ నా గోల్స్ ను పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని చెప్పారు. నేను అంగీకరిస్తున్నాను. నేనే ఈ నెలలో రైస్, నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. అవి రెండు లేకుండా ఉండలేను నాకు ఫేవరేట్. ఇక ఏం జరుగుతుందో చూడాలి.... అంటూ పోస్ట్ పెట్టింది. దానికి అల్లు అర్జున్ తన అఫీషియల్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి ‘ఆల్ ది బెస్ట్’ అంటూ రిప్లై ఇచ్చారు. 

ఇక ఐకాన్ స్టార్ Pushpa 2 The Rule లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంది. 

Manchu Lakshmi Accepted Allu Arjuns challenge NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios