తెలుగు సీరియల్ కార్తీక దీపం సంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్లుగా బుల్లితెర నంబర్ వన్ సీరియల్ గా తిరుగు లేకుండా దూసుకుపోతుంది కార్తీక దీపం. టీఆర్పీ విషయంలో కార్తీక దీపంకి పోటీ ఇచ్చిన మరో కార్యక్రమం లేదు. దేశంలోనే అత్యధిక టీఆర్పీ సాధించిన సీరియల్ గా భారీ రికార్డు కార్తీక దీపం సొంతం. లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ అంటే ఇష్టపడేవారిలో స్టార్స్ సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 


కాగా మంచు మోహన్ బాబు సతీమణి నిర్మలా దేవి కూడా కార్తీక దీపం సీరియల్ కి పెద్ద ఫ్యాన్ అట. కాగా కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. రసవత్తరంగా మారిన ఈ సీరియల్ లో దీప భర్త డాక్టర్ బాబులో మార్పు మొదలైంది. దీప కోసం ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డాక్టర్ బాబులోని ఈ మార్పు నిర్మలా దేవికి ఎంతో నచ్చిందట. 


దీప కోసం డాక్టర్ బాబు మొదటిసారి ఏడ్చాడట. దీనితో అమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యారంటూ నిర్మలా దేవి కూతురు మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. ఇక మంచు లక్ష్మీ లాంటి సెలెబ్రిటీ కార్తీక దీపం సీరియల్ పై స్పందించడంతో స్టార్ మా యజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. మీరు ట్వీట్ చేసినందుకు మేము కూడా సంతోషం అంటూ లక్ష్మీ ట్వీట్ ని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు.