మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అక్కినేని అఖిల్ (Akhil) నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ మేకర్స్ తాజాగా మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అక్కినేని అఖిల్ (Akhil) నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty) అఖిల్ తాజాగా చిత్రం ‘ఏజెంట్’ (Agent) లో కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో మమ్ముట్టి ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అఖిల్ చిత్రానికి మమ్ముట్టి ఒకే చెప్పడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ మరియు అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో నటించారు.’ అంటూ ట్విట్టర్ లో తెలిపారు. మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. యూనిఫాం మరియు మ్యాచింగ్ క్యాప్‌తో మమ్ముట్టి ఎప్పటిలాగే డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ మూవీకి స్పై థ్రిల్లర్ కథను వక్కంతం వంశీ రాశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సురేందర్ 2 బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలో మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు మేకర్స్.
