మళ్ళీ పెళ్లి మూవీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. నరేష్ తన జీవితకథలో స్వయంగా నటిస్తున్నారు. టీజర్ మైండ్ బ్లాక్ చేయగా ట్రైలర్ అంతకు మించి ఉంది.
ఏడాది కాలంగా నటుడు నరేష్ వ్యక్తిగత జీవితంలో హైడ్రామా నడుస్తుంది. నరేష్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేశారు. మూడో భార్య రమ్య రఘుపతి ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రమ్య రఘుపతి ఆరోపణలకు నరేష్ స్పందించారు. ఆమె మీద ఘాటైన విమర్శలు చేశారు. ఒకరిపై మరొకరు వ్యక్తిత్వ దాడి చేసుకున్నారు. చెప్పాలంటే నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం ఉదంతాన్ని నరేష్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా కలిపి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా చేశారు.
వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీని స్వయంగా సినిమా తీయడం అతిపెద్ద సాహసం. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల పాత్రలను కూడా సీన్ లోకి లాగారు. ట్రైలర్ టీజర్ పరిశీలిస్తే నరేష్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంది. తన వయసు మీద, శరీర పటుత్వం మీద కూడా ఆయన కామెంట్స్ చేసుకున్నారు. దానికి సంబంధించిన సీన్స్ పెట్టారు. ట్రైలర్ లో భార్య రమ్య రఘుపతిని కాలితో తన్నినట్లు కూడా ఓ సన్నివేశం చూడొచ్చు.
అటు పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం, భర్త గురించి చర్చించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, కారు ఊగడాలు వంటి బోల్డ్ సీన్స్ ఉన్నాయి. నరేష్ మొత్తంగా ఏదో పెద్ద సంచలనానికే పూనుకున్నాడనిపిస్తుంది. ఈ మూవీకి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. నరేష్ తనని తాను ప్రోమోలలో తప్పుగా ప్రొజెక్టు చేసి, సినిమాలో అసలు విషయం రివీల్ చేయవచ్చు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ లో భాగంగా రమ్య రఘుపతి నిజ స్వరూపం ఇది అని ఆమెను బద్నామ్ చేసే ఆస్కారం కలదు.

మొత్తంగా మళ్ళీ పెళ్లి రానున్న కాలంలో సంచలనాలకు, వివాదాలకు వేదిక కావడం ఖాయం. ఎమ్ ఎస్ రాజు ఈ చిత్ర దర్శకుడు. నరేష్ స్వయంగా నిర్మించారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. శరత్ బాబు కృష్ణగా, జయసుధ విజయ నిర్మలగా నటించారు. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల కానుంది.
