నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. అనుకున్న స్దాయిలో ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సీనియర్ నటుడు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli) రీసెంట్ గా ఓటిటిలో రిలీజైన సంగతి తెలిసిందే. అప్పటికే మీడియాలో పాపులర్ అవటంతో...వీరిద్దరి పరిచయం, పెళ్లి విషయాలనే కథగా తీసుకుని సినిమాని తెరకెక్కించడంతో విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. అనుకున్న స్దాయిలో ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలో సినిమా తొందరగానే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఓటీటీలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ వారంలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీల్లో టాప్ 10లో నిలిచింది. కానీ ఇప్పుడు ఓ ట్విస్ట్ వచ్చి పడింది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ మూవీని తొలగించింది. దాంతో మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
అందుతున్న సమాచారం మేరకు ..లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాని ఇంపాక్ట్ అది అని తెలుస్తోంది. తెలుగుతో పాటు కన్నడ స్ట్రీమింగ్‌ను కూడా ఆపేసినట్లు చెబుతోన్నారు. విజయకృష్ణా బ్యానర్‌పై నరేష్ స్వయంగా మళ్ళీ పెళ్లి మూవీని నిర్మించారు. ఈ సినిమాలో వనితా విజయ్‌కుమార్, శరత్‌బాబు, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.
