సూపర్ స్టార్ రజినీకాంత్ విలన్ గా మలయాళ స్టార్ హీరో...?
జైలర్ సినిమాతో జోరు పెంచాడు తమిల సూపర్ స్టార్ రజినీకాంత్. కుర్ర హీరోలు కూడా షాక్ అయ్యేలా నెక్ట్స్ సినిమాలను సెట్స్ ఎక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన 170 మూవీ సెట్స్ మీదకు వెళ్లిపోయింది.
జైలర్ సినిమాతో జోరు పెంచాడు తమిల సూపర్ స్టార్ రజినీకాంత్. కుర్ర హీరోలు కూడా షాక్ అయ్యేలా నెక్ట్స్ సినిమాలను సెట్స్ ఎక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన 170 మూవీ సెట్స్ మీదకు వెళ్లిపోయింది. రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. రజినీకాంత్ పని అయిపోయింది అని ప్రచారం చేసిన వారికి.. తన సినిమాలతో సమాధానం చెపుతున్నాడు తలైవా. ఇక తాజాగా రజినీకాంత్ కు సబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది అదేంటంటే..
సూపర్ స్టార్ జైలర్ బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తాడు అనుకున్నారుఅంతా. అయితే ఆమూవీపై కాన్సిల్ అనే వార్తలు రావడంతో క్లారిటీ ఇవ్వడానికి మరోసారి అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు టీమ్. ఈక్రమంలో రజినీకాంత్ ముందుగా జ్జానవేల్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేశారు. ఇటు లోకేష్ కూడా తాజాగా విజయ్ తో లియో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. లియో హడావిడి అయిపోయిన తరువాత సూపర్ స్టార్ తో మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు లోకేష్. ఈ విషయం ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు కూడా. 'లియో' థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో లోకేష్ వెల్లడించారు.
ఈ కథను ఎప్పుడో రాసుకున్నానని.. దానికి తుది మెరుగులు దిద్దుతానని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈసినిమాలో హీరోగా రజినీకాంత్ పాత్రను రాసుకున్న లోకేష్.. విలన్ పాత్రను కూడా రాసేసుకున్నాడట. అది కూడా మలయాళ స్టార్ హీరోదు దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను రాసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆయనతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్ గాసిప్.
అయితే ఆ విలన్ మరెవరో కాదు.. మాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ఆయన క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ సలార్ లో కీలక పాత్రలో నటించారు. అంతే కాదు మలయాళంలో పృథ్వి రాజ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఈరకంగా పృథ్విరాజ్అందరికి పరిచయం అయ్యారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర కోసం డిస్కషన్స్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.