సారాంశం

Ennenno Janmala Bandham : స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి ఫ్యామిలీ స్టొరీ నేపథ్యంలో సాగుతుంది. స్టోరీ  ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఇక ఈరోజు మార్చ్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో యష్,వేద హోలీరంగు జల్లుకుంటూ ఉండగా మాళవిక అక్కడికి వస్తుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని వసంత్,మాళవిక దగ్గరికి వెళ్లి అడగగా మాళవిక వసంత్ కి రంగు జల్లుదామని చూస్తుంది కానీ వసంత్, మాళవిక చేతిని పక్కకు తోసేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అందరూ ఆనందంగా ఉంటే చూస్తూ ఊరుకోలేవా అంటాడు వసంత్.

నేను నీ సొంత అక్కనే కదా, మనిద్దరి మధ్య రక్తసంబంధం ఉన్నది అయినా సరే ఎందుకు నన్నే అంతలా తప్పుపడుతున్నావు, ఎందుకు నేనంటే నీకు అంత కోపం. నాకన్నా ముందు విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరా ఎందుకు నేను ఏదో తప్పు చేసినట్టు అంతలా మాట్లాడతావు బహిరంగంగానే కదా విడాకులు తీసుకున్నాను అంటుంది మాళవిక.

భర్తకు విడాకులు ఇచ్చి ఇంకొకడి పంచన  చేరిన దానివి మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అప్పుడే నీకు నాకు ఉన్న సంబంధాలు అన్ని తెగిపోయాయి అని వసంత్ అంటాడు.నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు వసంత్ నాకు చిన్న సహాయం చేయాలి నాకు అభిమన్యుతో కలిసి నూరేళ్లు బతకాలని ఉన్నది.

 తనతో పెళ్లి జరగాలంటే వాళ్ళ అక్క నా పుట్టింటి నుంచి ఎవరో ఒకరిని నా తరపున తెమ్మని చెప్పింది. ఒక్క నెల రోజులు పాటు నా తమ్ముడు స్థానం తీసుకోమని చెప్తున్నాను అంతే అని అనగా దానికి వసంత్ చాలా కోపంతో రగిలిపోయి నేను చస్తే ఆ పని చేయను ఇక్కడ యష్ కి అంత అన్యాయం జరిగిన తర్వాత నేను నీకు ఆ పని ఎలా చేస్తాను అనుకున్నావు.

 దయచేసి బయలుదేరు అని కోపంగా మాళవికను పక్కకు తోసేస్తాడు.అప్పుడు మాళవిక గన్ పట్టుకొని నువ్వు ఒప్పుకోకపోతే నన్ను,నేనే కాల్చి చచ్చిపోతాను నేను నా జీవితం బాగు చేయమనే కదా అంటున్నాను, నీ ఆస్తులు ఏమీ  ఇవ్వమని అడగలేదు కదా నాకు ఒక చిన్న సహాయం చేస్తే చాలు నా జీవితం బాగుపడడం నీకు ఇష్టం లేదా నేను బతికితే  అభిమన్యు భార్యగా బతుకుతాను.

 లేకపోతే యష్ మాజీ భార్యగానే చస్తాను అని గురిపెడుతూ ఉండగా వేద వచ్చి గన్ పక్కన పారేస్తుంది. వేద నీకు నాకు మధ్య సన్నిహితాలు లేవు అలాగని స్నేహం కూడా లేదు కానీ తోటి ఆడపిల్లలా నువ్వు నా బాధను అర్థం చేసుకోగలవు కదా దయచేసి వసంత్ ని ఒప్పించు నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను నా చావు బతుకులు మీ మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

 ఆరోజు రాత్రి వసంత్ చెట్టు దగ్గర కూర్చుని జరిగినదంతా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వేద అక్కడికి వచ్చి వసంత్ ఒక్కసారి మాళవిక చెప్పిన మాటలు వినుతను కేవలం ఒక నెల వచ్చి పెళ్లి చేయమనే కదా అంటుంది తను చేసింది తప్పే కానీ తను జీవితం తన సరిదిద్దుకుంటుంది అంతే కదా అని అనగా దయచేసి ఇంకేమీ మాట్లాడద్దు వదినా నువ్వు చెప్తే నేను నీ మాటలు కాదనలేను కానీ నాకు మనస్సాక్షి ఉంటుంది కదా.

 మనస్ఫూర్తిగా నేను ఆ పని చేయలేను దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు అని అంటాడు. వేద అక్కడనుంచి వెళ్ళిపోతూ ఉండగా యష్ అక్కడికి వచ్చి ఇందాక వేదతో మాట్లాడింది విన్నాను నాకూ బాధగానే ఉన్నది. మాళవిక చేసింది తప్పే నన్ను కాదనుకొని వెళ్ళింది ఆరు సంవత్సరాల పాటు ఇంకొకడితో సహజీవనం చేసింది అయినా అభిమన్యుచేత తాళి కట్టించుకోలేకపోయింది.

ఇప్పుడు దాని జీవితం బాగు చేసుకుంటుంది. అయినా నాకు ఏమీ కోపంగా లేదు ఎందుకంటే ఒకప్పుడు నాకు లేనివన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి డబ్బు లేదు అని చెప్పి నన్ను వదిలి వెళ్ళింది ఇప్పుడు నేను బెస్ట్ సీఈవో నయ్యాను. అభిమన్యుని నా ఎడంకాలితో తొక్కుగలిగాను నన్ను కాదని వెళ్ళిపోయి మొదటి పెళ్లి పెటాకులు  చేసింది కానీ ఇప్పుడు దేవత లాంటి వేద వచ్చింది.

నా పిల్లలకు తల్లయింది. నాకు మంచి భార్య అయింది అయినా ఇప్పుడు మాళవిక మీద కోపం నాకన్నా, నీకన్నా వేదకు ఎక్కువ ఉండాలి.నాకు వేదకి పెళ్లి అనగానే మాళవిక ఎన్ని కుతంత్రాలు చేసినా సరే అడ్డుకుంటూ మనందరి కోసం ఎదురుగా నిలిచింది వేద అలాంటిది తనకే లేని బాధ నీకెందుకు అయినా సరే నేను మాళవికను పెళ్లి చేయమని అడుగుతున్నది నా పిల్లల కోసం.

 నా పిల్లల తల్లి సమాజంలో గౌరవం లేకుండా బతికితే నా పిల్లల మీదే దాని ప్రభావం పడుతుంది.నా పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను అని అనగా వసంత్ ఒప్పుకుంటాడు ఆ మాటలకి వేద ఆనంద పడుతూ మిస్సెస్  యశోదర్ గా ఉండడం నాకు చాలా గర్వంగా ఉన్నది అని అనుకుంటుంది ఆ తర్వాత రోజు ఉదయం బంగారపు కొట్టి వాడిని ఇంటికి పిలిపించి బ్రేస్లెట్ చూపించండి.

మా ఆయన కోసం అని అంటుంది ఇంతలో విన్ని అక్కడికి వచ్చి బ్రేస్లెట్ నాకోసమేనా థాంక్యూ అంటాడు. లేదు మా శ్రీవారి కోసం కొంటున్నాను మంచివి ఎంచు అని అంటుంది. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి విన్ని చేతి మీద వేసి చూస్తుంది వేద ఇంతలో యష్ ఆ దృశ్యాన్ని చూస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.