ఒక్క సినిమాతో అన్ని పరిశ్రమల దృష్టి తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా ఆయన తెరకెక్కించిన కెజిఎఫ్ సంచల విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాకు భారీ ఆదరణ దక్కడంతో సీక్వెల్ గా కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, వచ్చే ఏడాది విడుదల కుంది. కాగా ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. 


కెజిఎఫ్ 2 టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.  వచ్చే ఏడాది జనవరి 8న ఉదయం 10:18 నిమిషాలకు కెజిఎఫ్ 2 టీజర్ విడుదల కానుంది. దీనితో ఈ మూవీ టీజర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ న్యూస్ పిచ్చ కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కెజిఎఫ్ కి మించి కెజిఎఫ్ 2 సిద్ధం చేస్తున్నారని తెలుస్తుండగా టీజర్ పై ఆసక్తి పెరిగిపోయింది. 


ఇక కెజిఎఫ్ 2 టీజర్ ఆల్  రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. కెజిఎఫ్ కి మించిన అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి. ఈ మూవీ ప్రధాన విలన్ అధీరా రోల్ సంజయ్ దత్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు. హోమబుల్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది కెజిఎఫ్ 2 విడుదల కానుంది.