26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు.  


 అడవి శేష్ మేజర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగాతెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేస్తున్నారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. విశాఖలో ఈ మే 29 సాయంత్రం 4 గంటలకి మేజర్ స్పెషల్ షో పడనుండగా ఈ షో అనంతరమే అక్కడే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. 

Scroll to load tweet…

2008 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో చిత్ర ప్రోమోలు ఆసక్తికరంగా ఉండడంతో.. జాతీయంగా మంచి క్రేజ్ వచ్చిపడింది. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పలు పాటలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక అది అలా ఉంటే ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలఅవుతోంది. 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలవుతోంది. 

 ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన మేజర్ జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు (2 గంటల 28 నిమిషాలు) ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది.