Asianet News TeluguAsianet News Telugu

Major Movie: మేజర్ మూవీ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం లాక్, రెస్పాన్స్ అదిరిపోయింది

వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

major movie censor and run time details
Author
Hyderabad, First Published May 24, 2022, 7:38 PM IST

వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న 'మేజర్' చిత్రం చాలా ప్రత్యేకమైనది. 

26/11 ముంబై దాడులలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచిన బ్రేవ్ సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండడం విశేషం. 

మేజర్ మూవీ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంటోంది. జూన్ 3న మేజర్ మూవీ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యకమాలు పూర్తయ్యాయి. 148 నిమిషాల రన్ టైంని లాక్ చేశారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యూ ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. 

ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

దర్శకుడు శశి కిరణ్ ఫస్ట్ హాఫ్ లో సందీప్ వ్యక్తిగత జీవితాన్ని.. సెకండ్ హాఫ్ లో ముంబై దాడుల సంఘటనని, అతడి పోరాటాన్ని అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్స్ కి రెడీ అవుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios