అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చేసింది.
అమెరికాలో దాదాపు 150కి పైగా లొకేషన్లలో విడుదలైన ఈ సినిమాపై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాస్ వస్తోంది. సమంత, చైతులు తమ పాత్రల్లో జీవించేశారని.. ఎమోషనల్ గా సాగిన కథను బాగా డీల్ చేశారని ట్వీట్లు పెడుతున్నారు. అక్కినేని నాగార్జునతో పాటు మరికొందరు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
''మజిలీ'' చిత్రంలో సమంత, నాగచైతన్యలు బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురలి నటన అధ్బుతం''
అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
కొందరు అభిమానులు చైతు కెరీర్ లో ఇదొక పెద్ద బ్రేక్ అని, తెరపై చైతు-సామ్ లు కనిపించలేదని వారి పాత్రలే కనిపించాయని అంతా అధ్బుతంగా నటించారని అంటున్నారు.
