ఫైనల్ గా బడా మల్టీస్టారర్ RRR పట్టాలెక్కడానికి రెడీ అయ్యింది. వచ్చే నెల పూజ కార్యక్రమాలను మొదలుపెట్టి వీలైనంత త్వరగా నవంబర్ లోనే మొదటి షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారనే వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ తెరపై ఎలా కనిపిస్తారు అనేది ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. 

అయితే సినిమా గురించి ఎలాంటి అంశం వచ్చినా ప్రేక్షకుల ఊహలను కన్ఫ్యూజ్ చేస్తోన్న పాయింట్ ఒక్కటే. బాహుబలి 1 రిలీజ్ అనంతరం కట్టప్ప వెన్నుపోటు అందరిలో ఏ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా  ఈ మల్టీస్టారర్ కు సంబంధించి ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. 

అసలైతే జక్కన్న ఆ విషయంలో ఇప్పట్లో క్లారిటీ ఇవ్వడని ముందే ఊహించవచ్చు. మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాల్లో హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపించినా విలన్స్ ని అంతకంటే ఎక్కువ స్థాస్ట్రాంగ్  గా చూపించడాని చెప్పవచ్చు. 

రాజమౌళి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వస్తుందో విలన్స్ కు కూడా అదే స్థాయిలో క్రేజ్ వస్తుంటోంది. ఇక ఇప్పుడు #RRR కోసం దర్శకదీరుడు ఎవర్ని విలన్ గా చూపిస్తాడు అనేది మిలియన్ డాలర్ల సందేహం. 

సాధారణంగా ఒక స్టార్ హీరోకి విలన్ కావాలంటే ఎంతో ఆలోచించే జక్కన్న ఇప్ప్పుడు ఇద్దరు స్టార్ హీరోలకు వ్యతిరేఖంగా ఉండే పాత్రకోసం ఎవరిని సెట్ చేసి ఉంటాడో అనే ప్రశ్న అప్పట్లో  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సందేహం కంటే ఎక్కువ డైలమాలో పడేసింది. ఇకపోతే రూమర్స్ ప్రకారం ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు కొంత నెగిటివ్ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. 

ఇక బాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ నటుడిని విలన్ గా చేశారనే టాక్ కూడా వస్తోంది. మరి రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని నెలల పాటు వెయిట్ చేయక తప్పదు.