బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో హిట్ ప్రోగ్రాం.. బుల్లితెర ప్రేక్షకులు ఈ షోపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే బాలీవుడ్ లో 11 సీజన్లు పూర్తయ్యాయి.
బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో హిట్ ప్రోగ్రాం.. బుల్లితెర ప్రేక్షకులు ఈ షోపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే బాలీవుడ్ లో 11 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు బిగ్ బాస్ 12 ని టెలికాస్ట్ చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. సల్మాన్ ఖాన్ సారధ్యంలో ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన రెండు ప్రోమోలను ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు షోని మరింత ఆసక్తి క్రియేట్ అయ్యే విధంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ షోలో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారనే విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తన్నాయి. తాజాగా ఈ షోలోకి అడల్ట్ స్టార్ ని తీసుకురాబోతున్నారని సమాచారం. బ్రిటీష్ పోర్న్ స్టార్ డెన్నీడీ, అతడి గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ షోలో పాల్గొనడానికి ఈ జంట కోటికి దగ్గరగా మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా వారానికి చొప్పున.. మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చి వారిని హౌస్ లోకి తీసుకొస్తారా..? అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. గతంలో పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి ఆ తరువాత సినిమాల్లో బిజీ అయ్యింది.
