హాట్‌ యాంకర్‌ నిండు గర్భంతో ఉంది. పక్కన తన భర్త కూడా ఉన్నాడు. ఉన్నట్టుండి లిఫ్ట్ లో ఇరుక్కుంది. టెన్షన్‌ పడుతుంది. ఏదో జరుగుతుంది. అంతా టెన్షన్‌ టెన్షన్‌గా ఉంది.. మహేష్‌బాబు దీన్ని విడుదల చేశారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా చూడాల్సిందే. 

అనసూయ, విరాజ్‌ అశ్విన్‌ జంటగా రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్‌`. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని గురువారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా ? అని ఓ వ్యక్తి అరుస్తున్నారు. అందులో ఓ లేడీ గొంతు వినిపిస్తుంది. బయపడుతున్న శబ్ధం. లిఫ్ట్ లో పడిపోయి అనసూయ ఉంది. బిక్కుబిక్కు చూస్తూ విరాజ్‌ ఉన్నారు. ఈ మోషన్‌ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో గర్భవతి అయిన ప్రియగా అనసూయ, అభిగా విరాజ్‌ నటిస్తున్నారు. దీన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.