సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమా వచ్చి పది నెలలయ్యింది. సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో అలరించారు. ఆ తర్వాత కొత్త సినిమా ప్రకటించడానికి ఐదు నెలలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్‌ని ప్రారంభించలేదు. కరోనా కారణంతో ఇంకా వెయిటింగ్‌లో ఉంచాడు. ఆయన పరశురామ్‌తో `సర్కారు వారి పాట` సినిమా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే ఈ సినిమా షూటింగ్‌ని ఇంకా ప్రారంభించడం లేదుగానీ.. మహేష్‌ మాత్రం షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. సినిమాని పక్కన పెట్టి యాడ్‌ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కూల్‌డ్రింగ్‌ యాడ్‌, బైజు ఎడ్యూకేషన్‌ యాప్‌, అలాగే సోప్‌ యాడ్‌, రియల్‌ఎస్టేట్‌కి చెందిన యాడ్స్, ఫ్లిప్‌కార్డ్, కార్‌ యాడ్‌ ఇలా దాదాపు డజన్‌ యాడ్స్ చేస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు. ఫిప్‌కార్డ్ కోసం రెండు గెటప్‌లో కనిపించాడు. లాక్‌ డౌన్‌ సమయంలో కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 

తాజాగా ఫిప్‌కార్డ్ యాడ్‌ కోసం కొత్తగా రెడీ అవుతున్నారు మహేష్‌. మీసాలతో కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌కి మేకప్‌ చేస్తున్న ఫోటోని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. కృత్రిమంగా అమర్చేవి  ఎప్పుడూ రియల్‌గా కనిపించవు. వాటితో షూటింగ్‌ కచ్చితంగా కంఫర్ట్ గా, సరదాగా ఉండదు. ఎక్స్ పర్ట్స్ ఉన్నప్పుడు ఎవరు మాత్ర సవాళ్ళని ఇష్టపడరు` అని పేర్కొంది.