బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో ఈ ఆదివారం ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది. ఊహించని విధంగా మహేష్‌ విట్టా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నారని సమాచారం. 

టీవీ రియాలిటీలో అత్యంత ప్రజాదారణ పొందిన షోలో `బిగ్‌బాస్‌` ఒకటి. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లు కంప్లీట్‌కాగా, ఆరో సీజన్‌ `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌`(BiggBoss 6 OTT Telugu) పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. 24 గంటలు కంటిన్యూగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పుడు 11 మంది ఉన్నారు. నేడు(ఆదివారం) వీకెండ్‌లో మరో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కాబోతున్నారు. 

ఇప్పటి వరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా సస్పెన్స్ గా మారింది. ఓటింగ్‌లో అఖిల్‌, బిందు మాధవికి మంచి రెస్పాన్స్ ఉంది. టాప్‌లో దూసుకుపోతున్నారు. అరియానా గురించి చెప్పక్కర్లేదు. ఆమె ఫైర్‌ బ్రాండ్‌. 

యాంకర్‌ శివ గేమ్స్ లో యాక్టీవ్‌గా ఉంటూ తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు. స్వతహాగా ఆడియెన్స్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనకు మంచి ఓటింగ్‌ వస్తుంది. ఈ వారం కూడా మిత్ర శర్మ సేఫ్‌. మిగిలిందల్లా అనిల్‌, మహేశ్‌. ఇద్దరూ గేమ్‌ ఎవరి స్టైల్‌లో వారు గేమ్‌ ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో మహేష్‌ విట్టా ఈ వారం ఎలిమినేట్‌ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఏడో వారం మహేశ్‌ ఎలిమినేట్‌ అయ్యాడని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఆయనకు మంచి ఓట్లే వస్తున్నా, కావాలనే తప్పించారనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ఆయన స్థానంలో మరో కంటెస్టెంట్‌ని రంగంలోకి దించుతున్నారట. బాబా మాస్టర్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.