ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ 2.0 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దాదాపు 500 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 3డి విజువల్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. సెలబ్రెటీలు కూడా స్పెషల్ షో వేసుకొని మరి సినిమాను చూస్తున్నారు. 

ఇక రీసెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విజువల్ వండర్ ని చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమాతో శంకర్ మరో స్థాయికి చేరారు అంటూ రజినీకాంత్ - అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారని సినిమా ఎప్పుడు చూడని ఒక మంచి అనుబితిని అందించిందని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు. 

అందుకు సంబందించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతర దర్శకులు చిన్న తరహా సినీ నటులు కూడా శంకర్ డైరెక్షన్ ని అమితంగా పొగుడుతున్నారు. ఇక మొదటి రోజు సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 2.0 సినిమాకు రెహమాన్ సంగీతం అందించనున్నాడు.