Asianet News TeluguAsianet News Telugu

#SSMB28: బస్ లో భీబత్సమైన ఫైట్...బాబు ప్రస్తుతం ప్రిపరేషన్ లో...

 ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్  రామోజీ ఫిల్మ్ సిటిలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు బస్ లో జరిగే ఓ భారీ మాస్ ఫైట్ త్రివిక్రమ్ ప్లాన్ చేసారట. ఈ ఫైట్ తోనే సినిమా ప్రారంభం కానుందని సమాచారం. 

Mahesh, Trivikram movie to begin with a bus fight sequence
Author
First Published Sep 1, 2022, 3:56 PM IST


మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్  త్వరలో  మొదలుకానుంది.  థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ బయిటకు వచ్చింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్  రామోజీ ఫిల్మ్ సిటిలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు బస్ లో జరిగే ఓ భారీ మాస్ ఫైట్ త్రివిక్రమ్ ప్లాన్ చేసారట. ఈ ఫైట్ తోనే సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని వినికిడి. ఈ ఫైట్ సినిమా హైలెట్ లలో ఒకటని తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీన్ ఇదే అంటున్నారు. 

ఈ సినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు  ప్రచారం జరుగుతోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే సినిమాకు చెందిన టీమ్ ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోందిట. మహేష్ క్లియర్ గా ఈ విషయం చెప్పారని అంటున్నారు. కాబట్టి హిందీలో రిలీజ్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది..    ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఒక పాత్రలో మహేష్ లుక్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని బోగట్టా.

వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి చిత్రయూనిట్ స్పష్టతనిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుత కాలంలో, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ పాత్రలు ఉంటాయని మహేష్ బాబు పాత్రలు ప్రేక్షకులను అలరించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. 

మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు ఖలేజా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
 
 తాజాగా మహేష్ బాబు చొక్కా లేని అవతారంలో ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది త్రివిక్రమ్ సినిమా కోసమే అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ షర్ట్‌లెస్‌గా ఉండబోతున్నాడనే ఊహాగానాలకు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. SSMB28 సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios