Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌ `మహర్షి`కి మూడు జాతీయ అవార్డులు..

మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి ఏకంగా మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా `మహర్షి`కి ఓ అవార్డు రాగా, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ రాజుసుందరంకి అవార్డు వరించింది. 

mahesh starrer maharshi got three national awards arj
Author
Hyderabad, First Published Mar 22, 2021, 5:02 PM IST

మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి ఏకంగా మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా `మహర్షి`కి ఓ అవార్డు రాగా, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ రాజుసుందరంకి అవార్డు వరించింది. దీంతోపాటు ఉత్తమ నిర్మాణ సంస్థ విభాగంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకి మొత్తంగా ఐదు అవార్డులు వరించాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన `మహర్షి`లో పూజా హెగ్డే హీరోయిన్‌, అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం `జెర్సీ`, ఉత్తమ ఎడిటర్‌గా నవీన్‌ నూలిలకు అవార్డులు దక్కాయి. 67వ జాతీయ అవార్డులను సోమవారం సాయంత్రం ప్రకటించింది కేంద్రం. 2019లో విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను అందిస్తారు. గతేడాది ప్రకటించాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా వేసిన విషయం తెలిసిందే.  మరోవైపు ఇందులో ఉత్తమ చిత్రంగా మోహన్‌లాల్‌ నటించిన `మరక్కర్‌ః అరబికడలింతే సింహం` చిత్రం ఎంపికైంది. మరోవైపు ఉత్తమ సహాయ నటుడుగా విజయ్‌ సేతుపతి(సూపర్‌ డిలక్స్)కి దక్కింది. ఉత్తమ నటుడిగా ధనుష్‌(అసురన్‌), ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌(మణికర్ణిక, పంగా) లకు జాతీయ అవార్డులు వరించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios