Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram నుంచి కేకపెట్టించే లీక్...మహేష్ ఓ సీన్ లో

 సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

Mahesh Sings Cheppave Chirugaali #GunturKaaram jsp?
Author
First Published Dec 25, 2023, 9:20 AM IST


స్టార్ రైటర్ కమ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. రూపొందుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ తో యంగ్ హీరోయిన్  శ్రీ లీల కలిసి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి .  చాలా కాలం క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా వచ్చే 2024 సంక్రాంతి బరిలో పోటీగా నిలవనుంది ఈ చిత్రం. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్నీ కూడా ఫ్యాన్స్ ని  విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా.. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఫినిష్ కాలేదు.  ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టలేదు. అయితేనేం రోజుకో క్రేజీ వార్త వచ్చి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేస్తోంది. తాజాగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...

ఈ సినిమాలో మహేష్ బాబు .... తన సూపర్ హిట్ సాంగ్ చెప్పవే చిరుగాలి ని పాడనున్నారు. అయితే ఫుల్ పాట కాదు..సరదాగా హీరోయిన్ ని ఇంప్రెస్ చేయటానికి కూనిరాగంలా పాడతాడన్నమాట. అయితే ఇదో రీమిక్స్ సాంగ్ అని ప్రచారం జరుగుతోంది. అదేమి కాదు అని తెలిసింది. పాటలో మెదటి రెండు లైన్స్ ని మహేష్ పాడతాడన్నమాట. ఇది విజిల్స్ వేయించే సీన్ అవుతుందని చెప్తున్నారు. 

అలాగే  ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటకి వచ్చింది. గుంటూరు కారం సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం చాలామందిని అనుకోని చివరికి డింపుల్ హాయతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గద్దల కొండ గణేష్ సినిమాలో “సూపర్ హిట్టు నీ హైటు” అనే ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ  గుంటూరు కారంలోనూ ఓ రేంజిలో అదరకొట్టబోతోందిట.

అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  ఈ చిత్రాన్ని  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios