సూపర్ స్టార్ మహేష్ నుండి మూవీ వచ్చి ఏడాది దాటిపోయింది. ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఆ మూవీ విడుదలైన నెలల వ్యవధిలో సర్కారు వారి పాట చిత్రాన్ని మహేష్ ప్రకటించారు. సరిలేరు నీకెవ్వరు  మూవీ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ మూవీ చేయాల్సివుంది. అయితే కొన్ని కారణాల చేత ఆ ప్రాజెక్ట్ హోల్డ్ పెట్టాడు మహేష్. 

దీనితో సర్కారు వారి పాట మూవీ ప్రకటనకు కొంత ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా మూవీ షూటింగ్ జనవరకి  మార్చారు. కాగా ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో మొదలుకానున్నట్లు సమాచారం అందుతుంది. మహేష్ ఇప్పటికే దుబాయ్ పయనమయ్యారట. మొదటి షెడ్యూల్ దర్శకుడు పరుశురాం అక్కడే ప్లాన్ చేశాడట. 

ఇక సర్కారు వారి పాట మూవీ కథపై ఇప్పటికే కొన్ని కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలపై తెరకెక్కే సెటైరికల్ మూవీ అంటున్నారు. అలాగే ఈ మూవీలో మహేష్ రోల్ సరికొత్తగా ఉంటుందని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.