సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి నైజాం కింగ్ అనిపించుకున్నాడు. మహర్షి సినిమాతో ఒక ఏరియాలో మూడు సార్లు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. మహర్షి సినిమాకు టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ లో మాత్రం సినిమా స్టడీగానే ఉంది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో సమ్మర్ లో ఆడియెన్స్ సినిమాను చూసి గాని ఒక నిర్ణయానికి రావడం లేదు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నైజం ఏరియాలో మహర్షి సినిమా 20 కోట్లు దాటేసింది. మహేష్ సినిమాకు నైజాంలో  ఈ స్థాయిలో వసూళ్లు అందడం ఇది మూడవసారి. టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఈ రికార్డ్ ను అందుకోలేదు. శ్రీమంతుడు - భరత్ అనే నేను ఇప్పుడు మహర్షి సినిమా.. ,మహేష్ కెరీర్ ను మార్చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

శ్రీమంతుడు - భరత్ అనే నేను కూడా వేగంగా 20 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని మహేష్ ని నైజాంలో రాజుగా మార్చాయి. ఇప్పుడు మూడవసారి కూడా ఆ రికార్డ్ ను అందుకొని తన మార్కెట్ రేంజ్ ను పెంచుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమాను దిల్ రాజు - అశ్విని దత్ - పివిపి సంయుక్తంగా నిర్మించారు.