మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నా త్రివిక్రమ్ తో చేసిన రెండు సినిమాలు మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అతడు సినిమాలో సైలెంట్ తోనే  వైలెంట్ వైబ్రేషన్స్ తెప్పించాడు. ఇక ఖలేజా సినిమా రిజల్ట్ తేడా కొట్టినా మహేష్ సరికొత్త కామెడీ టైమింగ్ తో తనకు తానే సరికొత్తగా కప్రజెంట్ చేసుకున్నాడు. . 

ఇక తరువాత సినిమాలు ఎలా ఉన్నా కూడా మహేష్ ను సరికొత్త నటుడిగా మార్చింది ఆ సినిమాలే. ఇక ఇప్పుడు మహర్షిలో ఉండే క్యారెక్టర్ కూడా మహేష్ కెరీర్ లో బెస్ట్ రోల్ గా నిలిచిపోతుందట. ఎమోషన్ - కామెడీ - లవ్ - ఫ్రెండ్షిప్ - రాయల్ -స్టైలిష్.. ఇలా అన్ని వేరియేషన్ లో వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ ను ఒక రేంజ్ లో ప్రజెంట్ చేశాడట. 

ఇక డబ్బింగ్ విషయంలో కూడా మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సినిమా రిలీజ్ 10 రోజులు ఉందంటే డబ్బింగ్ పనులను మొదలెట్టే మహేష్ ఇప్పుడు మాత్రం నెల ముందే డబ్బింగ్ వర్క్స్ ను స్టార్ట్ చేశాడు. అందులో కూడా సరికొత్త వేరియేషన్స్ ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటాడో తెలియాలంటే వచ్చే నెల 9వరకు ఆగాల్సిందే.