సూపర్ స్టార్ మహేష్ కొత్త లుక్ ట్రై చేశారు. మహేష్ కెరీర్ లో ఫ్యాన్స్ ఎన్నడూ ఎరుగని పెదరాయుడు గెటప్ లో ఆయన దర్శనం ఇచ్చారు. మహేష్ నయా గెటప్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న మహేష్ అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అంబాసిడర్ గా మహేష్ ఉన్నారు. ఈ కంపెనీ కొత్త ప్రచార వీడియోలో మహేష్ కొత్త లుక్ లో కనిపించారు. తెల్ల పంచె, చొక్కా, భుజంపై కండువా ధరించిన మహేష్ కోరమీసంతో కనిపించడం విశేషం. గ్రామ పెద్దలా మహేష్ ఆ లుక్ లో అద్భుతంగా ఉన్నారు.
 
అదే యాడ్ లో మహేష్ యంగ్ లుక్ లో కూడా కనిపించారు. మహేష్ మరో లుక్ లో చాలా హ్యాండ్ సమ్ గా ఉంది. 40 ప్లస్ లో ఉన్న మహేష్ ఇప్పటికీ కాలేజ్ బాయ్ లా కనిపించడం విశేషం. ఈ యాడ్ లో మహేష్ అప్పీరెన్స్ ఫ్యాన్స్ ని  ఫిదా చేస్తుంది. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ సమయంలోనే మహేష్ కొన్ని వ్యాపార ప్రకటనల షూటింగ్ లో పాల్గొన్నారు. 

ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ మూవ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పరుశురామ్ మహేష్ ని ఈ చిత్రంలో ఓ భిన్నమైన పాత్రలో ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుంది. సర్కారు వారి పాట టైటిల్ మరియు ప్రీ లుక్స్ విశేష స్పందన దక్కించుకున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.