సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందించి సక్సెస్ ని అందుకున్నారు. తాజాగా సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఇందులో మహేష్ బాబు కాలర్ ఎగరేసి మరీ గర్వంగా సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు.

ప్రెస్ మీట్ పూర్తయిన తరువాత చిత్రబృందం పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో మహేష్ బాబు చాలా జోష్ గా కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మరో ఫోటో షేర్ చేశారు.

ఈ ఫోటోలో మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లిని ఎంతో సంతోషంగా ముద్దు పెడుతున్నారు. ఈ ఫోటో షేర్ చేసిన వంశీ ''నా బెస్ట్ మూమెంట్.. ఇంతకు మించి ఇంకేం కోరుకోను'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

'మహర్షి' లాంటి సినిమాను తనకిచ్చిన దర్శకుడిపై మహేష్ తన ప్రేమను ఈ విధంగా చూపించాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలానే వంశీ మరో ఫోటో షేర్ చేశారు. అందులో వంశీ, మహేష్ తమ కూతుర్లతో కలిసి కనిపిస్తున్నారు. ఇప్పట్లో 'మహర్షి' సెలబ్రేషన్స్ ఆగేలా లేవు. 

Scroll to load tweet…

Scroll to load tweet…