మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే తట్టుకోలేరు.. నాగబాబుపై కత్తి కామెంట్

Mahesh Kathi Warns Naga Babu
Highlights

మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరు. జాగ్రత్తగా ఉండండి. నన్ను బెదిరిస్తారా ..? నేను చావడానికి సిద్ధంగా ఉండే నేను నా హక్కుల గురించి పోరాడుతున్నాను

శ్రీరాముడిపై చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు కూడా ఉన్నారు. అయితే నాగబాబుని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కత్తి మహేష్.. నాగబాబుతో పాటు మెగాఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు. 

''నా పేరు కూడా ఉచ్చరించకుండా.. నన్ను నీచుడుగా సంబోధిస్తూ నాగబాబు గారు చేసిన వీడియో చూశాను. నాకు ఆయనమీద జాలి కలిగింది. నేనా నీచుడ్ని.. అంత నీచానికి ఏం పాల్పడ్డాను. ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్తిత్వం లేని మీరు నన్ను కామెంట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ రామభక్తులను చెబుతున్నారు. జనాలను మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలోకి చేరడం.. జబర్దస్త్ లాంటి షోలో కూర్చొని పిచ్చి నవ్వులు నవ్వుతుంటారు. మీరా సమాజానికి మంచి చేస్తున్నది?. మీరు హిందువు.. రాముడు ఆదర్శం గురించి మీ ఫ్యామిలీలో ఎంత పట్టుదలతో ఉంటారో మాకు బాగా తెలుసు. నేను సాధారణంగా మనుషుల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను.

కానీ ఒక దళితుడునైన నన్ను నీచుడు అంటూ సంబోధించావ్.. ఎంత కులహంకారం ఉంటే ఇలా మాట్లాడతారు.. మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరు. జాగ్రత్తగా ఉండండి. నన్ను బెదిరిస్తారా ..? నేను చావడానికి సిద్ధంగా ఉండే నేను నా హక్కుల గురించి పోరాడుతున్నాను. మీ మాటలు, చేతలు సక్రమంగా ఉంటే ఎవరూ మీ జోలికి రారు. నేనేం మాట్లాడానో కనీసం అర్ధం చేసుకోలేని మీరు అజ్ఞానంలో కొట్టుకుంటున్న మీరు నన్ను నీచుడు అంటారా..? ఇదే పంథా కొనసాగిస్తే మీ రాజకీయ జీవితం, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ ఎలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. మీరు హద్దుల్లో ఉండాలని కోరుకుంటున్నాను'' అని వెల్లడించారు. 
 

loader