ప్రస్తుతం  మహర్షి సినిమా చేస్తున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు తరువాత  ఎఫ్ 2 డైరక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా లైన్‌లో ఉండగానే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగతో మరో సినిమా చేయాలని భావించాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాప్‌ లిస్ట్‌లో చేరిపోయిన సందీప్‌ స్టార్ హీరోల దృష్టిని ఎట్రాక్ట్ చేసారు.

ఇద్దరి మధ్య  స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగినట్టుగా ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో మహేష్‌, సందీప్‌లు కలిసి కనిపించటంతో వీరి కాంబినేషన్‌లో సినిమా మొదలవ్వటం కన్ఫర్మ్ అని మీడియాలో వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్, సందీప్‌తో సినిమాకు  సెకండ్ ధాట్ లోకి వెళ్లినట్లుగా పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. 

అందుకు కారణం బోల్డ్ సబ్జెక్ట్ తో మహేష్ ని కలిసాడని..అంత బోల్డ్ గా ఉంటే ఆడచ్చేమో, సెన్సేషన్ క్రియేట్ కావచ్చేమో కానీ ఇన్నాళ్లుకూ బిల్డ్ చేసుకుంటూ వస్తున్న క్లాస్ ఇమేజ్ మొత్తం మాయమైపోతుంది. ఓ వర్గం ఖచ్చితంగా దూరం అవుతారని మహేష్ ఆలోచనలో పడినట్లు చెప్పుకుంటున్నారు.

అలాగని మహేష్ తో చేసే రెగ్యులర్ సినిమాల తరహాలో చెయ్యమందామంటే ఆ మాత్రం దానికి సందీప్ వంగా ఎందుకు అనిపిస్తుంది. అలాగే అలాంటి సబ్జెక్టు చేయటానికి సందీప్ కూడా నో చెప్పే అవకాసం ఉంది. అందుకే పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. మరో ప్రక్క   ప్రస్తుతానికి వీరి కాంబినేషన్‌కు బ్రేక్‌ పడినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా అర్జున్‌ రెడ్డి సినిమాను కబీర్ సింగ్‌ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నాడు.