నిన్న దుబాయ్‌లోని బిజినెస్ సర్వీస్‌సెంటర్ `ఇన్5దుబాయ్` గురించి చెప్పాడు మహేష్. అక్కడ షూటింగ్ జరపడం అద్భుతమైన అనుభవమన్నారు. తాజాగా శుక్రవారం దుబాయ్‌లోని ఎడారుల గురించి చెప్పారు. ముఖ్యంగా అక్కడి ఇసుక దిబ్బలను చూసి ఫిదా అయ్యాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మహేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అప్‌డేట్ పంచుకుంటూ ఈ సినిమాని అందరి నోట్లో నాన్చుతున్నారు. నిన్న దుబాయ్‌లోని బిజినెస్ సర్వీస్‌సెంటర్ `ఇన్5దుబాయ్` గురించి చెప్పాడు. అక్కడ షూటింగ్ జరపడం అద్భుతమైన అనుభవమన్నారు.
తాజాగా శుక్రవారం దుబాయ్‌లోని ఎడారుల గురించి చెప్పారు. ముఖ్యంగా అక్కడి ఇసుక దిబ్బలను చూసి ఫిదా అయ్యాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. `షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహాలో `సర్కారు వారి పాట` సినిమా చిత్రీకరణ జరగడం అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయి. ఇక్కడి అతిథ్యం, ప్రేమ గొప్పగా ఉన్నాయి` అని మహేష్ పేర్కొన్నాడు. అక్కడి మూడు ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈఏడారుల్లో జరుగుతుందని అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరో ఏదైనా ఓ విషయంపై స్పందించినా అది చాలా మంది జనాలకు రీచ్ అవుతుంది. అది కోట్ల విలువైన ఉచిత పబ్లిసిటీ అవుతుంది. ఓ స్టార్ యాడ్ చేస్తే కోట్లు తీసుకుంటారనే విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ చేస్తే కచ్చితంగా కోట్ల విలువైన పబ్లిసిటీ. అలాంటి పబ్లిసిటీని దుబాయ్‌కి చేసిపెడుతున్నాడు మహేష్. దుబాయ్ అందాలను మన ఆడియెన్స్ కి, ఆయన ఫ్యాన్స్ కి పరిచయం చేస్తున్నారు. అయితే ఇది మహేష్‌కి నచ్చి చేస్తున్నాడా? లేక ఇందులో ఏదైనా బిజినెస్ కోణం ఉందా? అనే డౌట్ కూడా వస్తుంది.
పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా రూపొందుతుంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీస్, 14రీల్స్ ప్లస్, జీఎంబీ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇందులో బ్యాంక్ ఉద్యోగిగా మహేష్ కనిపిస్తారని సమాచారం.
