మరోసారి ఫ్యామిలీతో వెకేషన్ కు చెక్కేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈసారి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం రొమాంటిక్ ప్లేస్ లను విజిట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు వెకేషన్లకు వెళ్ళడం.. ఏదో పక్క వీధికి వెళ్లినట్టు అయిపోయింది. ఇలా చూస్తుండగానే అలా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తున్నారు స్టార్ హీరో. ఈమధ్యే లండన్ లో ఎంజాయ్ చేసి వచ్చిన మహేష్.. ప్రస్తుతం మరోసారి ఫ్యామిలీతో ఫారెన్ కుచెక్కేశారు. ఆయన ఫారెన్ టూర్ కు వెళ్తుండగా ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారు.
రేపు (ఫిబ్రవరి 10) మహేష్, నమ్రతా మ్యారేజ్ డే కావడంతో.. ఇద్దరు కలిసి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. వెకేషన్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఫారెన్ లో ఎంజాయ్ చేయడానికి కొన్ని రొమాంటిక్ ప్లేస్ లు కూడా సెలక్ట్ చేసుకున్నారట జంట. అయితే వీరు ఎక్కడికి వెళుతున్నారు అనేది మాత్రం తెలియలేదు. ఈరోజు (ఫిబ్రవరి 9) ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోని మహేష్, నమ్రతా ఉన్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్లు ఎయిర్ పోర్ట్ లో ఉండగా.. నెటిజన్లు పోటీ పడి ఫోటోలు వీడియోలు తీశారు.
ఇక ఇక్కడ విశేషం ఏంటీ అంటే.. ఈ ఫొటోలో మహేష్ బాబు లుక్స్ కొత్తగా అనిపించాయి. డిఫరెంట్ లుక్ లో కనిపించారు సూపర్ స్టార్. ఈ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్లూ కాప్, గ్లాస్సెస్, షర్ట్ పై షర్ట్ వేసి అల్ట్రా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు దర్శనం ఇచ్చారు. ఇక ఈపిక్స్ ను చూసిన ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు. మహేష్ ఫోటోస్ ను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్.. చాలా అడ్డంకులు ఎదుర్కుని.. చాలా రోజులు గ్యాప్ తరువాత రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ సారధి స్టూడియోలో స్పెషల్ సెట్ వేసి.. అందులో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షూటింగ్ తో SSMB28 సినిమాకు సబంధించిన కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశారు టీమ్. ఇక షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే కాస్త బ్రేక్ తీసుకుని పెళ్ళిరోజు కోసం భార్య నమ్రతతో కలిసి షికారుకు చెక్కేశాడు మహేష్ బాబు. అయితే ఈటూర్ లో పిల్లలు సితార, గౌతమ్ మాత్రం కనిపించలేదు.
గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ రెండు సినిమాలు చేశాడు. అతడు, ఖలేజా సినిమాలు ఆడియన్స్ ని బాగా అలరించాయి. అయితే ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఇద్దరు. దాంతో త్రివిక్రమ్ , మహేష్ కాంబో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈమూవీలో మహేష్ బాబుకి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల... మరో పాత్రలో సంయుక్త మీనన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సర్కారువారి పాటతో అద్భుతమూన మ్యూజిక్ అందించిన ఎస్ ఎస్ థమన్.. ఈసినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి.. ఈ ఏడాది ఆగష్టు 11న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్.
