బిగ్‌బాస్‌ నాల్లో సీజన్‌ పదమూడో వారం ముగింపుకి వచ్చింది. అలాగే షో సైతం ముగియనుంది. మరో రెండు వారాల్లో ఎండ్‌ కార్డ్ పడబోతుంది. దీంతో ఆట మరింత ఉత్కంఠ నెలకొంది. నాగార్జున హోస్ట్ గా రన్‌ అయ్యే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ కోసం సూపర్‌ స్టార్‌ కదిలిరాబోతున్నారు. మహేష్‌బాబు గ్రాండ్‌ ఫినాలేలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

డిసెంబర్‌ మూడో వారంలో బిగ్‌బాస్‌4 గ్రాండ్‌గా ఫైనల్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఈ సారి షో అంత రంజుగా సాగలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. రానురాను మరింత బోరింగ్‌గా షో సాగుతుందనే కామెంట్‌ వినిపిస్తుంది. పైగా హౌజ్‌లో గేమ్‌ ఆడని, సైలెంట్‌గా ఉన్న వారిని కాపాడుకుంటూ వస్తున్న బిగ్‌బాస్‌, బాగా ఆడేవారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారు. దీంతో అనేక విమర్శలు మూటగట్టుకుంది. 

చివరి వరకు ఇదే విమర్శలు ఉంటే టోటల్‌ షో మీదే ప్రభావం చూపుతుంది. అయితే ఈ సారి గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. గత సీజన్‌లో గ్రాండ్‌ ఫినాలేకి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత సీజన్ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కి ట్రోఫీని, ప్రైజ్‌ మనీ అందించారు. ఈ సీజన్‌లో విన్నర్‌కి మహేష్‌బాబు చేతుల మీదుగా ఇప్పించాలని ప్లాన్ చేశారట. ఆయన వస్తున్నారంటే షోకి మరింత క్రేజ్‌ వస్తుంది. అందుకే మహేష్‌ని ఒప్పించారట. అందుకు సూపర్‌ స్టార్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సీజన్‌ ఫైనల్‌ ఎంతగా ఆకట్టుకోబోతుందో చూడాలి.