సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారని ఆయనతో పనిచేసిన వారు చెప్తూంటారు. కోపం వచ్చినా కొద్ది క్షణాలే అని, హిట్, ఫ్లాఫ్ లకు అతీతంగా ఉంటారని అంటూంటారు. అందుకే ఆయన సూపర్ స్టార్ స్దాయికి వెళ్లగలిగారనేది నిజం. అయితే రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వారు చేసిన పనితో మహేష్ అప్ సెట్ అయ్యారనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా  ప్రచారం అవుతున్న కారణం ఏమిటో చూద్దాం.

మహేష్ తాజా చిత్రం ‘మహర్షి’భాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. టాక్ డివైడ్ గా ఉన్న కలెక్షన్స్ లో మాత్రం కుమ్మేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  అలాగే థియోటర్ లలో చూసినా మరోసారి తమ ఇంట్లో చూద్దామనుకునే రిపీట్ ఆడియన్స్ , ఫ్యామిలీతో ఈ సినిమాకు వెళ్లలేకపోయినవాళ్లు అమెజాన్ ప్రైమ్ రిలీజ్ కోసం ఎదురూచూసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం జూలై 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తమ అభిమాన చిత్రాన్ని మరోసారి స్మాల్ స్క్రీన్ పై చూడాలని ఉత్సాహం చూపిస్తూండటంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.

అయితే దర్శక,నిర్మాతలు,మహేష్  ఈ సినిమా 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నారు.    క్రిందటనెల 28 వ తేదీన శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేసారు.   స్పెషల్ గెస్ట్ లుగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు సైతం వెళ్లాయి. అయితే అనుకోని విధంగా విజయనిర్మాల మృతి చెందటంతో ఆ పంక్షన్ కాన్సిల్ అయ్యింది. మరో తేదీ చూసి పంక్షన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు కానీ ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆలోచిస్తున్నట్లు కనపడటం లేదు.

అందుకు కారణం థియోటర్స్ లో పూర్తిగా మహర్షి డ్రాప్ అవటమే అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రావటంతో థియోటర్స్ లో చూసేందుకు ఇంకా ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించటం లేదు. ఈ నేపధ్యంలో మహేష్ కు ఈ చిత్రం 50 రోజుల పంక్షన్ చూడాలన్ని ఆలోచనను అమెజాన్ ప్రైమ్ తన ప్రమేయం లేకుండానే పాడు చేసినట్లు అయ్యింది. దాంతో ఆయన అప్ సెట్ అయ్యారని చెప్పుకుంటున్నారు. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం 'ఎఫ్ 2' మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును అధిగమించి 2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది.