సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సమ్మర్ లో విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీ కెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శనివారం రోజు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

మహేష్ ట్వీట్ చేస్తూ ఇప్పటివరకు తీసిన వాటిలో ఇది బెస్ట్ ఫోటో. నువ్వు టీనేజ్ లోకి అడుగుపెట్టావు. తెలియకుండా గడచిపోతున్న కాలంలో ఎదుగుతున్నావు. మా జీవితానికి నువ్వొక వెలుగు. లవ్యూ మై బాయ్ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. నమ్రత కూడా ఇంస్టాగ్రామ్లో గౌతమ్ ని విష్ చేసింది. 

ఇవ్విపుడు టీనేజ్ లోకి వచ్చావు.. మిస్టర్ గౌతమ్ ఘట్టమనేని అని నమ్రత ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.