Asianet News TeluguAsianet News Telugu

Guntur Kaaram Ott : ఓటీటీలోకి ‘గుంటూరు కారం’.. ఆ రెండు ఎక్ట్స్రా సీన్లతో వచ్చేస్తోంది.. డిటేయిల్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaram త్వరలో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించబోతోంది. అయితే ఓటీటీలోకి ఎక్ట్స్రా సీన్లతో రాబోతుందని తెలుస్తోంది. 

Mahesh Babu Trivikram Guntur Kaaram movie Ott Release with Extra Scenes NSK
Author
First Published Jan 30, 2024, 5:46 PM IST | Last Updated Jan 30, 2024, 5:49 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’ Guntur Kaaram. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మిశ్రమ స్పందన పొందినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అదరగొట్టింది. టాలీవుడ్ లో రీజినల్ ఫిల్మ్ గా ఈరేంజ్ కలెక్షన్లు సాధించిన తొలిచిత్రంగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. 

అయితే, ప్రస్తుతం ఎంతటి భారీ చిత్రమైనా థియేట్రికల్ రన్ ముగిశాక ఓటీటీలోకి వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే. సినిమా బాగుంటే.. ఆడియెన్స్ అటు థియేటర్లలో ఇటు ఓటీటీలోనూ వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం ఓటీటీ Guntur Kaaram Ott రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఓటీటీ విడుదలకు ముందుకు క్రేజీ అప్డేట్ అందింది. 

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ఫిబ్రవరి 9 నుంచి గుంటూరు కారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేటర్ వెర్షన్ లో ఈ చిత్రం నిడివి ఎక్కువ అవడంతో కొన్ని సీన్లను తీసేశారంట. ప్రస్తుతం ఆ సీన్లను యాడ్ చేసి ఓటీటీలోకి విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆ సీన్లు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

ఓటీటీలో రిలీజ్ వెర్షన్ లో అమ్మ సెంటింట్ మెంట్ తో కూడిన ఒక సాంగ్, అలాగే కబడ్డీ ఫైట్ సీన్ ను జోడించనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా వర్క్ మోడ్ లోకి వెళ్లారు. ఫారేన్ లో అడ్వెంచర్ ఫిల్మ్ కు సంబంధించిన ట్రెయినింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios