దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' సినిమా గతేడాది విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు సుకుమార్.

సినిమా బౌండ్ స్క్రిప్ట్ తో రావాలని మహేష్.. సుకుమార్ ని కోరాడు. రీసెంట్ గా మరోసారి సుకుమార్, మహేష్ ల మధ్య సిట్టింగ్ జరిగింది. మహేష్ కథ మొత్తం వినిపించమని అడిగితే తనకు ఇంకా ఆరు నెలల సమయం కావాలని అడిగారట సుకుమార్. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కాస్త సమయం పడుతుందని క్లియర్ గా చెప్పేశారట.

అంటే దీపావళికి కానీ సినిమా సిద్ధం కాదు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న 'మహర్షి' సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. అంటే ఈ సినిమా తరువాత మరో నాలుగు నెలల పాటు మహేష్.. కుమార్ కోసం ఎదురుచూడక తప్పదు.

మరో పక్కన సుకుమార్ తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. మరి సుకుమార్ కోసం మహేష్ ఎదురుచూస్తాడా..? లేక సందీప్ వంగాతో సెట్స్ పైకి వెళ్తాడా..? అనేది చూడాలి!