మహేష్ బాబుతో సినిమా చేయాల్సిన దర్శకుడు సుకుమార్ ఆ సినిమా పక్కన పెట్టి అల్లు అర్జున్ దగ్గరకు చేరాడు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. సుకుమార్.. మహేష్ బాబుతో చేయాలనుకున్న కథనే అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని సమాచారం.

మహేష్ బాబు కథలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా సూచించారు. ఇప్పుడు వాటి ఆధారంగానే స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు సుకుమార్. దీనికి సంబంధించి ఇటీవల మహేష్ ని కలిసిన సుకుమార్ మీకు చెప్పిన కథతోనే బన్నీతో సినిమా తీస్తున్నానని అతడి పర్మిషన్ కూడా తీసుకొని వచ్చాడని సమాచారం.

కథ ప్రకారం ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ రియలిస్టిక్ గా, 'రా'గా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ కథలో మార్పులు చెప్పినప్పటికీ బన్నీ మాత్రం ఎలాంటి మార్పులు సూచించలేదట.

ముందుగా బన్నీ.. త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసిన తరువాత సుకుమార్ సినిమాను పట్టాలెక్కిస్తాడు. మరి మహేష్ కోసం అనుకున్న కథలో బన్నీ ఎలా సెట్ అవుతాడో చూడాలి!