సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  విజయ్ దేవరకొండ హీరోగా ' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురిచింన రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.   ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగలోని ప్రాడ్స్ పై ఉండబోతోందని వినపడుతోంది. 

ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న బ్యాంక్ మోసాలు, పెద్దవాళ్లు బ్యాంక్ లు నామం పెట్టి ముంచేయటం, ఆ ప్రభావం సామాన్యులపై ఎలా ఉండబోతోందనే విషయాలు ఈ సినిమాలో అంతర్గతంగా చర్చిస్తారట. మహర్షి సినిమాలో వ్యవసాయం గురించి, భరత్ అనే నేను లో యువత,రాజకీయాలు గురించి డిస్కస్ చేసిన మహేష్ ఈ సినిమాలో అంతకు మించిన హాట్ టాపిక్ తో వస్తాడంటున్నారు. అయితే అది మెసేజ్ రూపంలో కాకుండా ఫన్ ఎంటర్టైనర్ గా మలుస్తారని అంటున్నారు.  మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలిసిందే. 

ఇక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దాని వల్ల చాలా చిత్రాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.. కొన్ని థియేటర్లు మూసివేయటం కారణంగా రిలీజ్ లు లేవు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ముగియ గానే ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం టీమ్ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను రివీల్ చేయనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకై కియారా అద్వానీ ని సంప్రదించగా ఆమె డేట్స్ సమస్యతో నో చెప్పినట్లు సమాచారం.   ఇప్పుడు సినిమా కోసం మరో హీరోయిన్‌ను కూడా వెతికే పనిలో పడింది మూవీ యూనిట్.

 “14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం  తమన్ అందించబోతున్నాడట.  అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.