Asianet News TeluguAsianet News Telugu

'మ‌హ‌ర్షి' కథ కాపీనా.. షాకైన దిల్‌రాజు ?

పెద్ద సినిమా దాదాపు ప్రతీది ఈ మధ్యకాలంలో కాపీ వివాదంలో ఇరుక్కుంటోంది. 

Mahesh Babu's Maharshi script not original?
Author
Hyderabad, First Published May 11, 2019, 12:57 PM IST

పెద్ద సినిమా దాదాపు ప్రతీది ఈ మధ్యకాలంలో కాపీ వివాదంలో ఇరుక్కుంటోంది. కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండగానే కాపీ కొట్టారంటూ కోర్టుకు వెళ్తూంటే, మరికొన్ని రిలీజ్ అయ్యాక బయిటకు వస్తున్నాయి. ఇప్పుడు మహర్షి చిత్రం కూడా అదే పరిస్దితి ఎదుర్కొందని,అయితే దిల్ రాజు తన చాతుర్యంతో దాన్ని పరిష్కరించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

వివరాల్లోకి వెలితే..సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం రిలీజైన మొదట ఆట నుంచి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.  ఈ చిత్రం కథను హరి,సాలమన్ , వంశీ పైడిపల్లి కలిసి రూపొందించారు. 

అయితే  మ‌హ‌ర్షి మెయిన్ ప్లాట్‌తో అప్ప‌టికే మ‌రో ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసుకుని రిజిస్ట‌ర్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ డైరక్టర్ మరెవరో కాదు..అనామకుడు అసలే కాదు.., శ్రీవాస్‌. రామ్ తో రామ రామ కృష్ణ కృష్ణ, బాలయ్యతో డిక్టేటర్ , గోపీచంద్ తో లౌక్యం వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన శ్రీవాస్. ఆయన  మ‌హ‌ర్షి సినిమా చూసి షాక్ అయ్యారట. అది తను తయారు చేసుకున్న కథకు బాగా దగ్గరగా ఉందిట. అలాగని వెంటనే ఆవేశపడి డైరక్టర్స్ అశోశియేషన్ లో కంప్లైంట్ చేయలేదు. గొడవ చెయ్యలేదు. 

తనకు ఉన్న పరిచయాలతో ..`మ‌హ‌ర్షి` చిత్రం ముగ్గురు నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజుని నేరుగా వెళ్లి క‌లుసుకుని విషయం చెప్పారు.  త‌మ `మ‌హ‌ర్షి` సినిమా క‌థ‌.. శ్రీవాస్ రాసుకున్న క‌థ ఒకేలా ఉండ‌టం దిల్‌రాజుకి కూడా ఆశ్చర్యంగా  అనిపించిందిట. అయితే ఈ విషయం పెద్దది కాకుండా , ముఖ్యంగా మీడియా ముందుకు వెళ్లకుండా సెటిల్ చేస్తే మంచిదని,  తమ బ్యానర్ లోనే సినిమా ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమి లేదు.  దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇది వ‌ర‌కు శ్రీవాస్ `రామ రామ కృష్ణ కృష్ణ‌` సినిమా చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios