తెలుగులో సినీ అభిమానులు భారీగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందీ అంటే అది రాజమౌళి, మహేష్ బాబు కాంబోనే. కెరీర్ లో ప్లాఫ్ అనేది ఎగరని రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఏ హీరోతో సినిమా చెయ్యబోతున్నారనే విషయమై ఇప్పటికే జక్కన్న.. క్లారిటీ ఇచ్చేసారు.
మహేష్ మూవీ పనులు రాజమౌళి త్వరలో మొదలు పెట్టనున్నాడని అందరికీ తెలుసు. ఓ మీడియాకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇస్తూ తన తదుపరి మూవీ మహేష్ బాబుతో ఉండనుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారని, ఈ సినిమాకు సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారని చెప్పేసారు.
రాజమౌళితో సినిమా చేసేందుకు మహేష్ కూడా రెడీ అనడంతో వారి కాంబోలో ఖచ్చితంగా అదిరిపోయే సినిమా ఉంటుంది. కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకు సరైన అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో అనేక రూమర్లు మీడియాలో వచ్చి పోతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
మహేష్ -రాజమౌళి సినిమా అడవి నేపధ్యంగా సాగే అడ్వెంచరస్ చిత్రంగా ఉంటుందని, ఇప్పటివరకూ తాను టచ్ చేయని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా చేసేలా జక్కన్న ప్లాన్ చేశారని టాక్. పూర్తిస్దాయిలో ఆఫ్రికన్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని, ఇందులోని సీన్లు ఇప్పటి వరకు ఇండియన్ తెరపై చూసి కూడా ఉండరని చెప్తున్నారు. యాక్షన్, థ్రిల్, డ్రామాగా హై వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌తో రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత రాజమౌళితోనే మహేష్ సినిమా ఉంటుంది. అందుకే `సర్కారు వారి పాట` అనంతరం మరే దర్శకుడికీ మహేష్ ఓకే చెప్పలేదు. రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. `ఆర్ఆర్ఆర్` విడుదల తర్వాత మహేష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్టుకు రాజమౌళి మెరుగులు దిద్దుతారట.
