సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి సినిమాస్ ని మహేష్ బాబు త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాడు.

నిజానికి ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టాల్సివుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ 'ఏఎంబి' ఓపెన్ కావాల్సివుంది. అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాతో ఈ థియేటర్ ని ఓపెన్ చేయాలని అనుకున్నారు. దీనికి అమీర్ ఖాన్ ని రప్పించాలని భావించారు.

కానీ అమీర్ ఖాన్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. దీంతో హైదరాబాద్ కి కూడా రాలేదు. ఈ విషయంలో మహేష్ చేసేదేంలేక తన ప్లాన్ మార్చుకున్నాడు. ఒక విధంగా మహేష్ కి ఈ విషయంలో మంచి జరిగిందనే చెప్పాలి. ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్స్ కూడా లేవు.

ఈ పెద్ద డిజాస్టర్ నుండి మహేష్ బాగానే తప్పించుకున్నాడు. ఇప్పుడు తన మల్టీప్లెక్స్ ని '2.0' సినిమాతో మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. థియేటర్ ప్రారంభోత్సవానికి రజినీకాంత్ ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.