ఈ సంక్రాంతికి విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ ని అందుకున్న మ‌హేష్ బాబు కెరీర్ పరంగా చాలా ఉషారుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ఏ డైరక్టర్ దర్శకత్వంలో చేయబోతున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇద్దరి ముగ్గరు డైరక్టర్స్ కథలు విని,ఫైనల్ గా...  త‌న 27వ సినిమాని `గీత గోవిందం` ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌టానికి నిర్ణయించుకున్నాడు మ‌హేష్. 

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని జీఎంబి ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. ఈ ఉగాది నుంచే ఈ సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

దాంతో  మే 31న అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఆ రోజు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. జూన్ రెండో వారం  నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని  ప‌ట్టాలెక్క‌ించి, 2021 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. అందుకు ఓ కారణం ఉంది.మహేష్ కెరీర్‌ని టర్న్ చేసిన 'పోకిరి' సినిమా 2006 సంవత్సరం అదే తేదీన విడుదలైంది. అదే సెంటిమెంట్‌తో మహేష్ బాబు, నిర్మాతలు ఇలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు మే నెల‌లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని చెప్తున్నారు.  ఈ నేపధ్యంలో మ‌హేష్, ప‌ర‌శురామ్ ఫ‌స్ట్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ… బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాన్ని సృష్టిస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.