Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ అడవుల్లో సాహసాలు.. మహేష్ జర్మనీకి వెళ్ళింది ఆ డాక్టర్ కోసమా..

గుంటూరు కారం హంగామా పక్కన పెడితే.. నెమ్మదిగా రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి సంబంధించిన పనులు జోరందుకుంటున్నాయి. 

Mahesh Babu meets doctor in germany for Rajamouli movie dtr
Author
First Published Jan 22, 2024, 10:09 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. మహేష్ బాబు మాస్ మ్యానరిజమ్స్ ఈ చిత్రంలో ఫ్యాన్స్ ని అలరించాయి. కానీ ఓవరాల్ గా మూవీ ఆశించిన సక్సెస్ సాధించలేదు. సంక్రాంతి సీజన్ కావడం, మహేష్ క్రేజ్ తోడవడంతో వసూళ్లు పర్వాలేదనిపించే విధంగా నమోదయ్యాయి. ఇక గుంటూరు కారం హంగామా పక్కన పెడితే.. నెమ్మదిగా రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి సంబంధించిన పనులు జోరందుకుంటున్నాయి. 

ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు కథగా ఈ చిత్రం భారీ యాక్షన్ అడ్వెంచర్ తో ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళిక సిద్ధం చేశారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. దీనితో ఇటీవల మహేష్ బాబు జర్మనీ వెళ్లారు. మహేష్ జర్మనీ వెళ్ళింది రాజమౌళి సినిమా పనుల కోసమే అంటూ ప్రచారం జరిగింది. 

అయితే తాజాగా మహేష్ బాబు జర్మనీ ఎందుకు వెళ్లారో అసలు విషయం బయటకి వచ్చింది. మహేష్ ఓ డాక్టర్ ని కలిసేందుకు జర్మనీ వెళ్లారు. రాజమౌళి చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో సాగుతుంది. అడ్వెంచర్, యాక్షన్ స్టంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనితో ఫిట్ నెస్ చాలా కీలకం అవుతుంది. 

గతంలో కూడా జర్మనీకి వెళ్లి మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నారు. తాజాగా డాక్టర్ తో దిగిన ఫోటోని మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ డాక్టర్ పేరు హరీ కొనిగ్. బాడీ ఫిట్నెస్, ఫిజియో ఎక్స్పర్ట్ అని తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫిట్నెస్ అవసరం అనే దానిపై మహేష్ ఆ డాక్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల్లో రాజమౌళి, మహేష్ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడి పరిస్థితులకు, మూవీకి అవసరమైన ఫిట్ నెస్ సాధించే పనిలో మహేష్ బాబు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios